తెలంగాణ

telangana

ETV Bharat / bharat

G20 Security Arrangements : డ్రోన్లు, బోట్లు, వేల మంది సిబ్బంది.. దిల్లీలో హైలెవల్ సెక్యూరిటీ - జీ 20 దిల్లీ సెక్యూరిటీ

G20 Security Arrangements : జీ-20 సమావేశాలకు వేదికైన దిల్లీ నగరం.. కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా వలయంలోకి వెళ్లింది. జీ 20 దేశాధినేతలు చేరుకుంటున్న క్రమంలో వాయుసేన, పారామిలిటరీ, మార్క్స్‌ వుమెన్‌, ఎన్‌ఎస్‌జీ, CAPF బలగాలు.. దిల్లీని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆకాశ మార్గంలో యాంటీ డ్రోన్‌ వ్యవస్థతో గస్తీ నిర్వహిస్తున్నారు.

G20 Security Arrangements
G20 Security Arrangements

By PTI

Published : Sep 8, 2023, 2:03 PM IST

Updated : Sep 8, 2023, 3:04 PM IST

G20 Security Arrangements :జీ 20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన దేశ రాజధాని దిల్లీ.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి అగ్రరాజ్యాల అధినేతల రాక నేపథ్యంలో పారామిలిటరీ, మార్క్స్‌ వుమెన్‌ ఫోర్సెస్‌తోపాటు రాష్ట్ర బలగాలు, మాన్యువల్‌ గానూ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ వంటి సాంకేతికతతో నిఘాను కట్టుదిట్టం చేశారు.

G20 Security In Delhi :జీ-20 దేశాల అధినేతలు బస చేసే ఐటీసీ మౌర్య, తాజ్‌, లలిత్‌ తదితర హోటళ్లు, ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే రహదారులు, సదస్సు వేదిక వరకు ఎన్‌ఎస్‌జీ, CAPFతోపాటు వాయుసేన తమ అధీనంలోకి తీసుకున్నాయి. ప్రగతి మైదాన్‌లో జరిగే ఈ సదస్సు కోసం.. 50వేలకుపైగా దిల్లీ పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ గగనతలంపై డ్రోన్‌లను మోహరించారు. ఇతర డ్రోన్లు ఎగరకుండా యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాట్లు చేశారు. జీ-20 సదస్సును పురస్కరించుకొని బహిరంగ సభలు, సమావేశాలు, నిరసనలు, ఆందోళనలకు అనుమతి నిరాకరించారు.

G20 Summit 2023 Delhi Restrictions: జీ-20 సదస్సు వేదిక భద్రత కోసం ప్రత్యేక కమిషనర్లు కమాండర్లుగా, డిప్యూటీ కమిషనర్లు జోనల్ కమాండర్లుగా వ్యవహరించనున్నారు. జాయింట్‌ కమిషనర్లు, డీసీపీలు హోటళ్ల వంటి ముఖ్య ప్రాంతాల్లో క్యాంప్‌ కమాండర్లు ఉంటారు. ఇప్పటికే విమానాశ్రయాల్లో విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. 207 రైళ్లను రద్దు చేశారు. పర్యటక ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. ప్రజలు మెట్రోలోనే ప్రయాణించాలని సూచించారు. ఔషధాలు, వైద్య సామగ్రి మినహా అన్ని ఆన్‌లైన్‌ డెలివరీ సేవలు నిలిపివేశారు. మూడు వేర్వేరు చోట్ల మొత్తం 15 వందల మంది ఫైర్‌ సిబ్బందిని, 90 వరకు ఫైర్‌ ఇంజిన్లను మోహరించారు.

NDMC ప‌రిస‌ర ప్రాంతాల్లో పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. NDMC అంతా.. క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది. స‌ద‌స్సుకు అనుసంధానం అయిన‌, అత్యవస‌ర అవ‌స‌రాల‌కు సంబంధించిన వాహ‌నాలు మిన‌హా ఎలాంటి వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డం లేదు. ప్రగతి మైదాన్ చుట్టూ.. సుమారు 13 వేల మందితో భద్రత నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బ‌ల‌గాలు, స్నైప‌ర్ టీమ్స్‌, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, క్విక్ యాక్షన్‌ టీం, డాగ్ స్క్వాడ్‌, ర‌సాయ‌న త‌ర‌హా దాడులు ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యవస్థలు, ప్రత్యేక శిక్షణ పొందిన బ‌ల‌గాలను మోహ‌రించారు.

ముస్తాబైన దిల్లీ..
G20 Summit 2023 Delhi Schedule : శని, ఆదివారాల్లో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. అర్జెంటీనా అధ్యక్షుడు అల్‌బర్టో ఫెర్నాండెజ్‌ ఈ ఉదయం దిల్లీ చేరుకున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సును తొలిసారి నిర్వహిస్తున్న భారత్‌.. దేశ సంప్రదాయం, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు విస్తృతమైనట్లు ఏర్పాట్లు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తదితరులు జీ-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. చైనా, రష్యా అధ్యక్షులు షి జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ స్థానంలో వారి ప్రతినిధులు పాల్గొననున్నారు.

G20 Bilateral Meetings : మూడు రోజులు బిజీబిజీగా మోదీ.. 15కి పైగా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు.. షెడ్యూల్​ ఇదే!

G20 Dinner Invite : జీ 20 అతిథులకు రాష్ట్రపతి విందు.. ఖర్గేకు అందని అహ్వానం.. దేవెగౌడ దూరం

Last Updated : Sep 8, 2023, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details