G20 Closing Ceremony 2023 : జీ-20శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించింది భారత్. శనివారం, ఆదివారం రెండురోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను సభ్యదేశాలన్నీ అంగీకరించాయి. తదుపరి గ్రూపు అధ్యక్షత బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాకు ప్రధాని నరేంద్రమోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తిని అయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌పై జరుగుతున్న కృషికి జీ-20వేదిక కావటం తనకెంతో సంతృప్తినిచ్చిన్నట్లు సదస్సు ముగింపు ప్రసంగంలో ప్రధాని మోదీ తెలిపారు. పలు కీలకాంశాలపై కూడా జీ-20 బృందం చర్చించినట్లు చెప్పారు.
G20 Closing Ceremony 2023 : బ్రెజిల్ చేతికి జీ20 పగ్గాలు.. సంస్కృత శ్లోకం చదివి, సుత్తి అప్పగించిన మోదీ - జీ20 సమ్మిట్
G20 Closing Ceremony 2023 : దిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జీ-20శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించింది భారత్. తదుపరి గ్రూపు అధ్యక్షత బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాకు ప్రధాని నరేంద్రమోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా సుత్తిని అయన చేతికి అందించారు.
By PTI
Published : Sep 10, 2023, 2:34 PM IST
G20 Modi Speech :ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అంశాన్ని జీ-20 శిఖరాగ్ర సదస్సు వేదిక నుంచి మరోసారి లేవనెత్తారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. ఐరాసలో సభ్య దేశాల సంఖ్య పెరిగినా కూడా.. భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల సంఖ్యలో మాత్రం మార్పు లేదన్నారు. జీ-20 సదస్సులో వన్ ఫ్యూచర్ అంశంపై మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రపంచ నూతన వాస్తవాలు.. అంతర్జాతీయ నూతన నిర్మాణాన్ని ప్రతిబింబించాలని సూచించారు. 51మంది సభ్య దేశాలతో ఐరాస ఏర్పాటైనప్పుడు.. ప్రపంచం భిన్నంగా ఉండేదని, ఇప్పుడు సభ్య దేశాల సంఖ్య దాదాపు 2వందలకు చేరినట్లు తెలిపారు. సమయానికి తగినట్టుగా మారని వారు ప్రాముఖ్యం కోల్పోవటం సహజమని ప్రధాని మోదీ హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీ సామాజిక క్రమానికి కొత్త అంశమని, ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని నియంత్రించడానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలని పిలుపునిచ్చారు.
నవంబర్ చివర్లో వర్చువల్ మీటింగ్
G20 Next President :జీ20లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించడానికి నవంబర్ చివర్లో దేశాధినేతలు వర్చువల్‌గా సమావేశం కావాలని ప్రతిపాదించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనికి అందరూ హాజరుకావాలని కోరారు. జీ20 సదస్సు ముగింపు సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. ఈ మేరకు సూచన చేశారు. అధికారికంగా నవంబర్ 30 వరకు భారత్ జీ20 అధ్యక్షత వహిస్తోందని.. మరో రెండున్నర నెలలు అధ్యక్ష స్థానంలో కొనసాగుతోందని చెప్పారు. అనంతరం ఓ సంస్కృత శ్లోకం చదివి జీ20 సదస్సు ముగిసిందని ప్రటించారు. కాగా.. డిసెంబర్ 1 నుంచి బ్రెజిల్ అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది.