బంగాల్ ఎన్నికలలో ప్రచారం చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అసంతృప్త నేతలు (జీ-23)కు నిరాశే ఏదురైంది. బంగాలో తొలి దశ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ నాయకుల జాబితాలో గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ వంటి తదితర జీ-23నేతల పేర్లను కాంగ్రెస్ చేర్చలేదు.
అయితే 30 మందితో కూడిన జాబితాలో ఇద్దరు జీ-23 నేతలు జితిన్ ప్రసాద్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్ పేర్లను చేర్చడం గమనార్హం. బంగాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అఖిలేశ్.. రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు.