G-23 leaders meet: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన గ్రూప్-23లోని కొందరు నేతలు సమావేశం కావటం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దిల్లీ నివాసంలో జరిగిన ఈ భేటీకి.. ఎంపీలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్ ఘోర పరాభవం- జీ23 నేతల సమావేశం - CWC meet
G-23 leaders meet: కాంగ్రెస్ అసంతృప్త నేతల జీ23 బృందంలోని కొందరు.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో శుక్రవారం సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
జీ23 బృందం
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలపై త్వరలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు.. గ్రూప్-23 నేతలు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్‌లో అధికారం కోల్పోవటం సహా మిగితా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి.