బంగాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. 'ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)ను స్థాపించారు ఫుర్‌ఫురా షరీఫ్ అహలే సున్నతుల్ జమాత్ వ్యవస్థాపకుడు పిర్జాదా అబ్బాస్ సిద్దికీ. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
అందరికీ న్యాయం అందేలా చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఆశయంతో ఈ పార్టీని స్థాపించినట్లు సిద్దికీ పేర్కొన్నారు. ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు త్వరలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.