భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat) కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లను అయినా దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా (CDS Bipin Rawat) ఉందన్నారు. చైనాకు బదులు చెప్పేలా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. లద్ధాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దులో సైనికులకు మౌలిక వసతుల అంశమే ప్రధానంగా ఈ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 2019లో కాగ్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా సైనికులకు పంపిణీ చేస్తున్న దుస్తులు, ఆహారం మొదలైన వాటి మీద సీడీఎస్ రావత్ (CDS Bipin Rawat) ఆధ్వర్యంలో అధికారులు చర్చలు నిర్వహించారు.