తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రికి ధరల సెగ- విమానంలోనే వాడీవేడిగా..!

Fuel Prices Hike: ధరల పెంపుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, కాంగ్రెస్ మహిళా విభాగం నేత నెట్టా డిసౌజా మధ్య విమానం వేదికగా వాడీ వేడీ చర్చ జరిగింది. దిల్లీ- గువాహటి విమానం నుంచి దిగుతున్న సమయంలో ఈ సంభాషణ జరిగింది.

Delhi Guwahati flight Smriti Irani video
స్మృతి ఇరానీ, నెట్టా డిసౌజా మధ్య సంభాషణ

By

Published : Apr 10, 2022, 10:05 PM IST

Fuel Prices Hike: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఎల్పీజీ, చమురు ధరల సెగ తగిలింది. ధరల పెంపుపై స్మృతి ఇరానీకి, కాంగ్రెస్ మహిళా విభాగం నేత నెట్టా డిసౌజా మధ్య విమానం వేదికగా వాడీ వేడీ చర్చ జరిగింది. దిల్లీ- గువాహటి విమానం నుంచి దిగుతున్న సమయంలో ఈ సంభాషణ జరిగింది. ఇండిగో విమానంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు ఆ విమానయాన సంస్థ ధ్రువీకరించింది.

విమానం దిగే సమయంలో తొలుత ఇరానీని డిసౌజా ఇంధన ధరల గురించి ప్రశ్నించారు. ధరల పెంపు కారణంగా స్టవ్‌లు గ్యాస్ లేకుండా తయారవుతున్నాయని డిసౌజా విమర్శించగా.. అబద్ధాలు చెప్పొద్దంటూ స్మృతి ఇరానీ బదులిచ్చారు. ధరల పెంపుపై ఇరువురు నేతల మధ్య కాసేపు చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను డిసౌజా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పెరుగుతున్న ఎల్పీజీ ధరల గురించి ప్రశ్నిస్తే కేంద్రమంత్రి వ్యాక్సిన్లు, రేషన్‌ గురించి మాట్లాడుతున్నారంటూ అందులో పేర్కొన్నారు. పేద ప్రజల కష్టాలపై కేంద్రమంత్రి స్పందన చూడండి అంటూ ట్వీట్ చేశారు. వీడియో తీస్తున్న సమయంలో స్మృతి ఇరానీ సైతం వీడియో తీయడం కనిపించింది. కొన్ని పదాలు వినిపించనప్పటికీ.. ఎల్పీజీ, చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ నేత ప్రశ్నించగా.. గత కొన్ని నెలలుగా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను కేంద్రమే అందిస్తోందని స్మృతి ఇరానీ చెప్పడం వినిపించింది.

ఇదీ చదవండి:'ఇకపై అన్నీ మంచి రోజులే'.. 161 అడుగుల విగ్రహం ఆవిష్కరించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details