FTCCI Excellence Tourism Award for Ramoji Film City : పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీకి... మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యాటకరంగంలో రామోజీ ఫిల్మ్ సిటీ చేస్తున్న విశేష కృషికిగానూ... తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య-(ఎఫ్‌టీసీసీఐ).... ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.... తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా.. రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీ.హెచ్.విజయేశ్వరి అవార్డు అందుకున్నారు.
FTCCI Excellence Awards 2023 : పర్యాటక రంగంలో రామోజీ ఫిల్మ్‌సిటీ... స్థిరమైన, నిబద్ధతతో కూడిన ప్రయాణాన్ని సాగిస్తోందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఎక్స్‌లెన్స్ టూరిజం అవార్డు కోసం... ఎఫ్‌టీసీసీఐకి 22 రంగాలలో 150 దరఖాస్తులు రాగా... అందులో రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... పారిశ్రామిక రంగంలో తెలంగాణ కనబరుస్తున్న ప్రతిభ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే భవిష్యత్ తరాలు ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై పలు సూచనలు చేశారు.