తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జుట్టు రాలుతుందని.. ప్రాణం తీసేసుకున్న యువతి! - hair fall suicide

Girl Suicide Due to Hair Fall: చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇలాగే.. జుట్టు రాలిపోతోందని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది.

frustrated from hair problems, a young woman committed suicide
frustrated from hair problems, a young woman committed suicide

By

Published : Jul 2, 2022, 10:18 PM IST

Girl Suicide Due to Hair Fall: కర్ణాటకలోని మైసూర్​లో ఘోరం జరిగింది. జుట్టు రాలిపోతుందని మనస్తాపంతో ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని 21 ఏళ్ల కావ్యశ్రీగా గుర్తించారు. రాఘవేంద్ర ఎక్స్​టెన్షన్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఆమె కొద్దిరోజులుగా హేర్​ ఫాల్​ సమస్యతో బాధపడుతోంది. ఎన్నో చికిత్సలు తీసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. క్రమక్రమంగా జుట్టు మొత్తం ఊడిపోయింది. దీంతో.. తీవ్ర కుంగుబాటుకు లోనైన యువతి.. ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న నజారాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details