Frontline workers Covid 19: కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు, వైద్యులుపై కరోనా విరుచుకుపడుతోంది. సుమారు 1,700 మంది దిల్లీ పోలీసులు వైరస్ బారిన పడినట్లు దిల్లీ పోలీస్ శాఖ తెలిపింది. కేవలం జనవరి 1 నుంచి 12వ తేదీ లోపే ఈ కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది.
సోమవారం వరకు డిపార్ట్మెంట్లో వైరస్ సోకిన వారి సంఖ్య 1,000 గా ఉండగా.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 కేసులు బయటపడ్డాయి. సమావేశాలు అన్నీ వర్చువల్‌గా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన వారు హోం క్వారెంటైన్‌కు పరిమితం కావాలని సూచించారు.
మహాలో 481 మంది వైద్యులకు...
మహారాష్ట్రలో వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనితో పాటే వైరస్ బారిన పడే వైద్యుల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. ఇప్పటి వరకు సమారు 481 మంది రెసిడెంట్ వైద్యులు వైరస్ బారిన పడినట్లు మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ప్రెసిడెంట్ డా. అవినాష్ ధహిపాలే తెలిపారు.
కెప్టెన్‌కు కరోనా...
పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల వైరస్ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్లు తెలిందని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారెంటైన్లో ఉన్నట్లు తెలిపిన ఆయన.. తనను కలిసిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.