తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్లాకు పంచాయతీ అధ్యక్షురాలిగా పారిశుద్ధ్య కార్మికురాలు - Kerala news

కేరళలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు... పని చేస్తున్న బ్లాకు పంచాయతీకే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారామె.

From a sanitation worker with the Block Panchayath to its president , CPIM picks sanitation worker Anandavalli to head the Block
బ్లాకు పంచాయతీ అధ్యక్షురాలుగా పారిశుద్ధ్య కార్మికురాలు

By

Published : Dec 31, 2020, 4:29 PM IST

నిన్నటివరకు ఆమె ఒక తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలు. కానీ, అదే బ్లాకు పంచాయతీ అధ్యక్షురాలు అయ్యారు. ఎలా సాధ్యమనుకుంటున్నారా?

కేరళ కొల్లం జిల్లాలోని తలవూర్​ బ్లాకు పంచాయతీలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తున్నారు ఆనందవల్లి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేసి.. 654 ఓట్లు మెజారిటీతో గెలిపొందారు. అనంతరం పని చేస్తున్న బ్లాకుకే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు.

సంతోషంలో కుటుంబ సభ్యులు

చిన్నస్థాయి నుంచి అధ్యక్షురాలుగా ఎన్నికవడం చాలా గర్వంగా ఉందన్నారు ఆనందవల్లి. గత పదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న ఆమె ఎన్నికపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె భర్త మోహన్​ పెయింటింగ్​ పని చేస్తారు. సీపీఎం స్థానిక కమిటీ సభ్యుడు కూడా.

ఇదీ చూడండి:కుక్కకు బర్త్​ డే గిఫ్ట్​గా 250 గ్రాముల గోల్డ్​ చైన్

ABOUT THE AUTHOR

...view details