తమిళనాడు మదురైలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వారాంతాల్లో తన భర్త క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తానని బాండ్ పేపరుపై వధువుతో సంతకం చేయించుకున్నారు పెళ్లి కొడుకు స్నేహితుడు. ఇదేంటి ఇలా కూడా చేస్తారా.. అని అనుకుంటున్నారా? అయితే అలా ఎందుకు చేశారో ఓ సారి తెలుసుకోవాల్సిందే.
ఇదీ అసలు విషయం: హరిప్రసాద్ అనే వ్యక్తి.. తేనీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన 'సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్' జట్టుకు కెప్టెన్. హరిప్రసాద్ స్వస్థలం ఉసిలంపాటి సమీపంలోని కీజా పుదూర్ అనే గ్రామం. అతడికి మదురైకి చెందిన పూజ అనే యువతిని వివాహం కుదిరింది. అయితే ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.
నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన పెళ్లికొడుకు స్నేహితులు.. పెళ్లి కుమార్తెకు ఓ షరతు విధించారు. శని, ఆదివారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని పెళ్లి కుమార్తెను కోరారు. రూ.20 బాండ్ పేపరు మీద సంతకం చేయమన్నారు. ఆటపట్టించేందుకు చేస్తున్నారేమోనని పూజ అనుకుంది. అయితే బాండ్‌పై సంతకం చేయమని పూజపై ఒత్తిడి తెచ్చారు హరిప్రసాద్ స్నేహితులు. అప్పుడు పూజ.. బాండ్‌పై సంతకం చేసింది. "సూపర్ స్టార్ టీమ్ కెప్టెన్ అయిన నా భర్త హరిప్రసాద్‌ను ఇక నుంచి అన్ని శని, ఆదివారాల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాను' అని హామీ ఇచ్చింది.
ఇవీ చదవండి:2024 ఎన్నికలపై PK లేటెస్ట్ ఎనాలసిస్ ఇదీ.. KCR, నీతీశ్‌పై కీలక వ్యాఖ్యలు
బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం.. ఆపై కిరోసిన్ పోసి