తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Friend Carries Body On Scooty : ఫ్రెండ్​ను చంపి మృతదేహాంతో స్కూటీపై సవారీ.. వాళ్లు చూడగానే.. - paraded half naked in Dhanbad village

Friend Carries Body On Scooty : స్నేహితుడిని హత్య చేసి మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అసోంలోని గువాహటిలో శనివారం జరిగింది. డ్రగ్స్ మత్తులోనే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Friend Carries Body In Scotty
Friend Carries Body In Scotty

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 8:03 PM IST

Updated : Oct 8, 2023, 10:38 PM IST

Friend Carries Body On Scooty :డ్రగ్స్ మత్తులో స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం ఆ మృతదేహాన్ని స్కూటీపై పెట్టుకుని బయట పారేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే స్థానికులు గమనించడం వల్ల మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

ఇదీ జరిగింది
బమునిమెయిదాన్​ రైల్వే కాలనీకి చెందిన రోహిత్ దర్జీ, శుభ్రజీత్​ బోరా ఇద్దరు స్నేహితులు. శనివారం మొత్తం రోహిత్​తోనే సరదాగా గడిపాడు శుభ్రజీత్​​. అనంతరం డ్రగ్స్​ సేవించిన శుభ్రజీత్​.. బిజయ జ్యోతి అపార్ట్​మెంట్​లో రోహిత్​​ను హత్య చేశాడు. తర్వాత తన స్కూటీపైనే మృతదేహాన్ని పెట్టుకుని బయట పారేసేందుకు వెళ్లాడు. దీనిని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే స్థానికులను చూసిన శుభ్రజీత్​.. మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. రోహిత్​​ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు శుభ్రజీత్ బోరా పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

స్కూటీపై మృతదేహాన్ని తీసుకెళ్తున్న శుభ్రజీత్​

మృతదేహాన్ని కాలువలో పడేసిన పోలీసులు
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేశారు పోలీసులు. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. న్యాయం జరిగేలా చూడాల్సిన పోలీసులు.. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్ల వైరల్‌గా మారింది.

మరోవైపు ఆ పోలీసుల తీరును సీనియర్‌ అధికారులు వెనకేసుకొస్తున్నారు. ప్రమాదంలో మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని.. కొన్ని శరీర భాగాలను రికవరీ చేయడానికి సాధ్యం కాకపోడం వల్లనే వాటిని కాలువలో పడేశారని మీడియాకు వివరించారు. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం వల్ల ఆగమేఘాల మీద కాలువలో వేసిన మృతదేహాన్ని వెలికి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీసులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. డ్రైవర్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా మరో ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

నగ్నంగా ఊరేగించారని ఆత్మహత్య
గ్రామంలో నగ్నంగా ఊరేగించడం వల్ల మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని ధన్​బాద్ జిల్లాలో జరిగింది. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణమైన వారి పేర్లను చెబుతూ ఓ వీడియోను తీశాడు. ఈ వీడియోను చూసి తన చావుకు కారణమైన వారిని శిక్షించాలని కోరాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Two Women Walking Naked On Road : నగ్నంగా రోడ్డుపై తల్లీకూతుళ్లు.. శాలువా కప్పి కాపాడిన ఎమ్మెల్యే

Old Man Suicide After Raped Girl : ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య

Last Updated : Oct 8, 2023, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details