ఛత్తీస్గఢ్ అడువుల్లో నక్సల్ దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించింది ఫ్రాన్స్. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్కు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. ఈ మేరకు భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యూయేల్ లీనైన్ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తంచేశారు.
"ఛత్తీస్గఢ్లో అమరులైన జవాన్ల పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం. బాధితులు, క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని అరికట్టే పోరులో భారత్కు ఫ్రాన్స్ అండగా ఉంటుంది."