తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం - train accident news today maharashtra

మహారాష్ట్రలోని అమరావతిలో బొగ్గు లోడ్​తో వెళ్తున్న ఓ గూడ్స్​ రైలు ప్రమాదానికి గురైంది. 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణానష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

derailed at Amaravati
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

By

Published : Aug 15, 2021, 2:04 PM IST

మహారాష్ట్ర అమరావతి సమీపంలో ఓ గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. బద్నేరా-నార్ఖేడ్​ మార్గంలో సుమారు 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన అర్థరాత్రి 12.45 ప్రాంతంలో జరిగింది.

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు
పట్టాలు తప్పి పక్కకు జరిగిన చక్రాలు
పట్టాలు తప్పడం వల్ల నెలపాలైన బొగ్గు

ఇంజన్​ నంబర్​ 2380, 2343 గల గూడ్స్​ రైలు బల్లార్షా నుంచి నార్ఖేడ్​కు బొగ్గుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే నార్ఖేడ్-భుసవాల్ ప్యాసింజర్, కాచిగూడ ఎక్స్‌ప్రెస్​లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

పట్టాలు తప్పడం వల్ల నెలపాలైన బొగ్గు
పట్టాలు తప్పి ఒకదాపై ఒకటి పడిన బోగీలు

ఘటనాస్థలాని చేరుకున్న సిబ్బంది ఈ మార్గాన్ని క్లియర్​ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 150 మంది కార్మికులు దీనిపై పని చేస్తున్నారు.

ఇదీ చూడండి:సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు

ABOUT THE AUTHOR

...view details