కేరళలోని ఓ జైలు అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఖైదీలను పాదరక్షల తయారీలో భాగస్వామ్యులను చేస్తున్నారు. వాళ్లు తయారు చేసిన చెప్పులను సరసమైన ధరల్లో విక్రయిస్తున్నారు. 'ఫ్రీడమ్ వాక్' బ్రాండ్ పేరుతో తిరువనంతపురంలోని పూజప్పుర కేంద కారాగార ఖైదీలు వీటిని తయారు చేస్తున్నారు.
యంత్రాలు తెచ్చి..శిక్షణ ఇచ్చి..
కారాగారంలో రూ.కోటితో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ పాదరక్షల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇందుకోసం రూ.3 లక్షలు విలువ చేసే యంత్రాలను తీసుకువచ్చారు. మొదటి దశలో ఐదుగురు ఖైదీలకు తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇంతకుమందు ఇదే జైలులో ఖైదీలతో చపాతీలు, శానిటైజర్లు, మాస్కులు తయారు చేయించారు.