Free Education For Poor Girls :ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు చదువు చెబుతూ వారికి తల్లిగా మారారు మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన సోనియా జాలీ అనే మహిళ. ఉప్కార్ సొసైటీ అనే ఎన్జీఓను స్థాపించి పేద బాలికలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. 31 ఏళ్ల వయసులో ఆరుగురు బాలికల బాధ్యతలను భుజానికెత్తుకున్న సోనియా.. ప్రస్తుతం 130 మందికి చదువు చెబుతున్నారు.
"నాకు దృఢ సంకల్పం, అభిరుచి ఉంది. ఆరుగురు పిల్లలకు ఉచిత విద్యను అందించడం ప్రారంభించా. ఇప్పుడు 130మంది బాలికలు, ఐదు శాఖలు, 13మంది ఉపాధ్యాయులు మా ఎన్జీఓలో ఉన్నారు. మా దగ్గర ఉన్న ఓ చిన్నారి ప్లే గ్రూప్‌లో ఉంది. పెద్ద అమ్మాయి బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది."
--సోనియా జాలీ, ఉప్కార్ సొసైటీ ఫౌండర్
సోనియా జాలీ స్థాపించిన ఉప్కార్ సొసైటీలో చదువుతున్న బాలికలందరూ ఆమెను అమ్మ అని పిలుస్తున్నారు.
"నేను గత రెండు ఏళ్లుగా నుంచి ఇక్కడ చదువుతున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చదవడం, పనులను చేస్తున్నాను. అలాగే డ్యాన్స్ చేస్తుంటాం. పాటలు పాడుతుంటాం."
--షాను కుశ్వాహా, విద్యార్థి