Free Bus Travel For Woman In Karnataka : కర్ణాటకలో మహిళలు ప్రభుత్వ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఈ హామీని 'శక్తి' పేరుతో జూన్ 11న కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. అయితే రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పథకం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతున్నట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. సోమవారం ఒక్కరోజే 8 కోట్ల 84 లక్షల రూపాయల భారం ప్రభుత్వ ఖజానాపై పడిందని రవాణా శాఖ తెలిపింది. అలాగే శక్తి పథకం ప్రారంభమైన ఆదివారం.. కోటి 40 లక్షల రూపాయల భారం ప్రభుత్వంపై పడినట్లు వెల్లడించింది. దీంతో రెండు రోజుల్లోనే కర్ణాటక ప్రభుత్వంపై 10 కోట్ల 24 లక్షల రూపాయల ఆర్థిక భారం పడిందని పేర్కొంది.
సోమవారం.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 3.58 కోట్లు, సిటీ బస్సులను నడుపుతున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ రూ. 1.75 కోట్లు, వాయవ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ రూ. 2.11 కోట్లు, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ రూ.1.40 కోట్ల ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాయి. ఇదే విధంగా సంవత్సరం అంతా ఖజానాపై భారం పడితే.. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాదికి దాదాపు రూ.3,200 కోట్ల నుంచి 3,400 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది.
--ఆర్టీసీ అధికారి
Free Bus Ticket For Ladies In Karnataka : రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగాబస్సులో ప్రయాణించేలా శక్తి పథకాన్ని ఆదివారం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. విధాన సౌధ వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. పథకం ప్రారంభానికి సూచికగా ఐదుగురు మహిళలకు ఉచిత టికెట్లను అందజేశారు.
శక్తి యోజన నిబంధనలివే
- Shakti Scheme Guidelines :మహిళలు 'సేవా సింధు' ప్రభుత్వ పోర్టల్ ద్వారా శక్తి స్మార్ట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మూడు నెలల్లో కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది.
- శక్తి స్మార్ట్ కార్డులు జారీ చేసే వరకు లబ్ధిదారులు.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను ఉపయోగించుకుని ప్రయాణించవచ్చు.
- లబ్ధిదారులు కర్ణాటకకు చెందిన వారై ఉండాలి. కేవలం సిటీ, రెగ్యులర్, ఎక్స్ప్రెస్ బస్సులకే ఈ పథకం వర్తిస్తుంది.
- మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా సరకు రవాణా చేస్తుంటే దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
- రాష్ట్రంలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంతర్రాష్ట్ర బస్సులకు ఈ శక్తి పథకం వర్తించదు.
- రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, వజ్ర, వాయు వజ్ర, ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్ ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ వంటి అన్ని లగ్జరీ బస్సులను పథకం నుంచి మినహాయించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.