Sunny Leone Charity Show Fraud : సన్నీ లియోనీ, నోరా ఫతేహీ లాంటి సినీ నటులతో చారిటీ షో నిర్వహిస్తామని దాదాపు రూ. 9 కోట్లు వరకు మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. పోలీసులకు దొరక్కుండా కొద్ది నెలలుగా పరారీలో ఉన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల రంగంలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్- ఎస్టీఎఫ్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. ఈ కేసులో దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్రలోని పుణెకు చెందిన విరాజ్ త్రివేది అలియాస్ వివేక్, గుజరాత్‌కు చెందిన సమీర్ కుమార్, జయంతి భాయ్ దేరావాలిలు ముఠాగా ఏర్పడి.. పుణెలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. టైగర్ ష్రాఫ్, సన్నీ లియోనీ. నోరా ఫతేహి వంటి సినీ తారలు, గాయకులు గురు రంధవా, సచేత్ పరంపరా.. షోలో పాల్గొంటారని నమ్మించారు. అనంతరం షో టికెట్లు అమ్మి దాదాపు రూ. 9 కోట్ల వసూలు చేశారు. ఆ కార్యక్రమం రద్దు కావడం వల్ల పరారయ్యారు. దీంతో గోమతి నగర్ విస్తార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sunny Leone Fraud : కేసు విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. దాదాపు మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో లఖ్‌నవూ పోలీసులు రాష్ట్ర ఎస్టీఎఫ్ సహాయం కోరారు. అనంతరం రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. జులై 27న ప్రధాన నిందితుడు విరాజ్ త్రివేది, బయంతి భాయ్ దేవారాలియాను పుణెలో, సమీర్ కుమార్ జితేంద్ర భాయ్ శర్మను అహ్మదాబాద్‌లో అరెస్టు చేశారు. అయితే, వీరిపై ఇప్పటికే సుశాంత్ గోల్ఫో సిటీ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్- ఐపీసీ వివిధ సెక్షన్ల రెండు కేసులు నమోదయ్యాయి.
సన్నీ లియోనీ నిజంగానే మోసపోయింది!
Sunny Leone News In Telugu: ఇంతకుముందు సన్నీ లియోనీ నిజంగానే మోసపోయింది. ఆన్లైన్ కేటుగాళ్లు ఆమెను బురిడీ కొట్టించారు. ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ఆన్లైన్లో లోన్ తీసుకున్నారు. ఈ విషయం ఆమె ట్వీట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఆమె బ్యాంక్ అధికారులను సంప్రదించగా, వారు సన్నీని మోసం చేసిన వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారు. అనంతరం సన్నీ బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.