Identity theft for 41 years:బిహార్లోని నలంద జిల్లాలో ఓ ఆసక్తికరమైన కేసుపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 40 ఏళ్లుగా ఓ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధించింది.
కథేంటంటే?:బెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్గవాన్ గ్రామానికి చెందిన భూస్వామి కామేశ్వర్ సింగ్కు ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. అతడి పేరు కన్నయ్య సింగ్. 1977లో కన్నయ్య సింగ్ ఆచూకీ కోల్పోయాడు. చండీ హైస్కూల్లో చదివే కన్నయ్య.. పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు.
Athadu cinema kind of fraud:కొన్నేళ్ల తర్వాత 'భర్తరి' అనే సాధువు గ్రామానికి వచ్చాడు. అతడిని కన్నయ్య అని భావించిన గ్రామస్థులు.. కామేశ్వర్ ఇంటికి తీసుకెళ్లారు. అయితే, కామేశ్వర్ సింగ్ కుమార్తే రామసఖి దేవికి అనుమానం వచ్చింది. అతడు తన సోదరుడు కాదని వాదించింది. 1981లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ ఆస్తి కొట్టేసేందుకే అతడు తమ ఇంటికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, దర్యాప్తులో నిజం బయటపడింది. ఇంటికి వచ్చిన వ్యక్తి కన్నయ్య సింగ్ కాదని తేలింది. అతడి అసలు పేరు దయానంద్ గోసాయి అని, లకాయి గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు.