కరోనా కారణంగా ఏడాదిన్నరగా పిల్లలు ఇంటికే పరిమితం అయ్యారు. బయటకెళ్లి ఆడుకోవడానికి అవకాశం లేదు. దాంతో టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోవటంతో వారిని అదుపు చేసేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. అయితే.. కేరళ మలప్పురానికి చెందిన ఇషాల్ మాత్రం అందరికంటే భిన్నం. తోటి వారు అందులో ఫోన్లో గేమ్స్ ఆటుకుంటుంటే.. ఇషాల్ మాత్రం ఆ గేమ్‌లను సృష్టిస్తోంది. ఇప్పటికే 60 మొబైల్ గేమింగ్ యాప్స్, వెబ్‌సైట్స్‌ను రూపొందించి ఔరా అనిపిస్తోంది.
నాలుగో తరగతిలోనే..
మలప్పురానికి చెందిన ఇషాల్.. షాహిద్, సమీషా దంపతుల పెద్ద కుమార్తె. ఇజ్రాయెల్ నుంచి ఆ కుటుంబం మలప్పురానికి వచ్చింది. ప్రస్తుతం ఇషాల్ నాలుగో తరగతి చదువుతోంది. ఇషాల్ తల్లిదండ్రులు విద్యారంగంలో పనిచేస్తున్నారు. కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకొని సాంకేతికతపై పట్టు సాధించింది ఇషాల్.