తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నవారిని కడతేర్చిన 14ఏళ్ల కొడుకు ​ - బెంగళూరులో దంపతుల హత్య

పుత్రుడంటే పున్నామ నరకం నుంచి కాపాడేవారంటారు. కానీ.. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే.. కన్నవారిని కనికరం లేకుండా.. అతిదారుణంగా చంపాడు. మంచివారితో స్నేహం చేసి.. బాగా చదువుకోమని చెప్పడమే ఈ హత్యకు కారణమైంది. కర్ణాటకలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Murder
హత్య

By

Published : May 8, 2021, 1:44 PM IST

కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. బెంగళూరు జిల్లా కార్యాలయం సమీపంలోని న్యూమరాలజీ జోన్​లో గత గురువారం జరిగిన దంపతుల హత్య కేసులో 14ఏళ్ల కొడుకే నిందితుడనే అసలు నిజం ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనలో నిందితుణ్ని అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఏం జరిగిందంటే.?

యాదగిరి జిల్లాకు చెందిన హనుమంతరాయ(42), హొణ్నమ్మ(34) దంపతులు.. బెంగళూరు కరిహోబనహళ్లి సమీపంలోని న్యూమరాలజీ జోన్​లో పని మనిషులుగా చేసేవారు. పక్కనే ఉన్న షెడ్​లో నివాసముంటూ.. రాత్రివేళల్లో పని చేసే​ ప్రాంగణంలోనే నిద్రించేవారు. ఎప్పటిలాగే గురువారం(ఈ నెల 6న) ఉదయం సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. తలుపులు తాళం వేసి ఉన్నందున.. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లగా.. ఆ దంపతులు విగతజీవులుగా పడిఉన్నారు.

హనుమంతరాయ, హొణ్నమ్మ దంపతులు(ఫైల్​)

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. కన్న కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడనే అసలు విషయం బయటపడింది.

ఇదీ చదవండి:భౌతిక దూరం పాటించమన్నారని పోలీసులపై దాడి

తండ్రిని నెట్టి, తల్లిపై రాయితో..

వయసొచ్చిన కొడుకు తోటి స్నేహితులతో తిరుగుతూ చెడిపోవడం ఇష్టంలేని తల్లిదండ్రులు.. అతడికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆగ్రహించిన కుమారుడు ఆవేశానికిలోనై.. నిద్రిస్తున్న సమయంలో తండ్రిపై పెద్ద బండరాయి వేశాడు. అది పొరపాటున తల్లిపై పడింది. ఆమె స్పృహ కోల్పోయింది. ఈ శబ్దం విని తండ్రి లేవగా.. వెంటనే ఆయన్ను బలంగా నెట్టేసి హతమార్చాడు. తల్లి స్పృహలోకి వస్తే అసలు నిజం బయటపడుతుందనే కారణంతో తల్లిని కూడా చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఇదీ చదవండి:చదువుకోవాల్సిన బాలుడు సాక్స్​ల అమ్మకం- సీఎం సాయం

ABOUT THE AUTHOR

...view details