తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మదర్సా టాయిలెట్​లో నాలుగేళ్ల చిన్నారిపై రేప్​.. గొంతు కోసి.. - మహారాష్ట్రలో రేప్ ఘటనలో నిందితుడికి శిక్ష

ఓ మదర్సా​లోని టాయిలెట్​లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణమైన ఘటన బిహార్ రామనగర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Four year old girl raped in Madrasa toilet
టాయిలెట్​లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

By

Published : Feb 23, 2023, 7:33 AM IST

Updated : Feb 23, 2023, 8:35 AM IST

బిహార్ రామనగర్​లో దారుణం జరిగింది. బగహ సమీపంలోని ఓ మదర్సా టాయిలెట్​లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
బగహ సమీపంలో ఉన్న ఓ మదర్సా టాయిలెట్​ వద్ద నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఓ యువకుడు(18) పాల్పడ్డాడు. ఆ సమయంలో చిన్నారి ఏడుస్తూ కేకలు వేసింది. దీంతో చిన్నారి గొంతు కోసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అయితే చిన్నారి ఏడుపు విన్న ఓ వ్యక్తి టాయిలెట్​ వైపు వెళ్లాడు. అతడు రావటం గమనించిన నిందితుడు వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం జరిగింది. నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడని సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై మాట్లాడిన పోలీస్ స్టేషన్ హెడ్ అనంతరామ్​.. "చిన్నారిని వైద్య పరీక్షల కోసం జీఎమ్​సీహెచ్​ బెట్టియాకు తరలించాము. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటాము" అని చెప్పారు.

మైనర్ బాలికపై రేప్​.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..
స్నేహితుడి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి.. గర్భవతిని చేసిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది స్పెషల్​ కోర్టు. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలో జరిగింది. అసలేం జరిగిందంటే?..

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం..
నిందితుడికి (33) చెందిన మూడంతస్తుల భవనంలోని టాప్​ ఫ్లోర్​లో బాధితురాలి కుటుంబం అద్దెకు ఉండేవారు. అయితే 2017 జూలై 8న బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆమె తల్లి తనను హాస్పిటల్​కు తీసుకెళ్లింది. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా బాధితురాలు నాలుగున్నర నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఏం జరిగిందని కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆరా తీయగా అసలు నిజం బయట పడింది.

2017 మార్చిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు తన వద్దకు వచ్చి పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. దీంతో ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు సబర్బన్ ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆరేళ్ల తర్వాత నిందితుడికి ఇప్పుడు శిక్ష ఖరారైంది.

Last Updated : Feb 23, 2023, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details