తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రసాదం కోసం వెళ్లిన చిన్నారిపై.. సామూహిక అత్యాచారం - దిల్లీలో సామూహిక అత్యాచారం

దిల్లీ నగరంలో నాలుగేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి సమీప ఆలయానికి వెళ్లిన బాలికను అపహరించి అత్యాచారం చేశారు దుండగులు. తీవ్ర రక్త స్రావం కావటం వల్ల మూడు రోజులుగా అపస్మారక స్థితిలోనే ఉంది చిన్నారి.

gangraped in Delhi
నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

By

Published : Nov 7, 2020, 6:56 PM IST

Updated : Nov 7, 2020, 8:32 PM IST

దేశ రాజధాని దిల్లీలో బాలికలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. తాజాగా దిల్లీలోని బవానా ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈనెల 4వ తేదీన నగరంలోని జేజే కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి.. తన స్నేహితులతో కలిసి ప్రసాదం కోసం సమీపంలోని గుడికి వెళ్లింది. ఆలయ పరిసరాల నుంచి చిన్నారిని ముగ్గురు వ్యక్తులు అపహరించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తీవ్రంగా రక్త స్రావం అవుతన్న చిన్నారిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. గత మూడు రోజులుగా అపస్మారక స్థితిలోనే ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: మహిళపై సామూహిక అత్యాచారం-నలుగురి అరెస్ట్​

Last Updated : Nov 7, 2020, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details