ఓ అపార్ట్మెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక ఏర్పాటు చేస్తుండగా విద్యుత్తీగ తాకి నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరు అనేకల్లో జరిగింది.
ఇదీ జరిగింది...
అత్తిబెలె-సర్జాపూర్ రోడ్ ఇండ్లబెలె ప్రాంతంలో ఇటీవలే నిర్మించిన జీఆర్ కల్చర్ అపార్ట్మెంట్ ఓపెనింగ్ కోసం ఓ వేదిక ఏర్పాటు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అనుకోకుండా 11కేవీ విద్యుత్ తీగను తాకి నలుగురు వర్కర్లు మృతిచెందగా.. ఇద్దరు కోమాలోకి వెళ్లారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితులు యడవణహళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.