కేరళలో జికా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42కు చేరింది. కొట్టాయంలో ఒక కేసు, తిరువనంతపురంలో మూడు కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళలో మరో నలుగురికి జికా వైరస్ - kerala zika virus
కేరళలో జికా వైరస్ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. బుధవారం మరో నాలుగు జికా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42కు చేరినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
జికా వైరస్
కేరళలో మొదటిసారి జులై 17న జికా వైరస్ కేసు నమోదైంది. తిరువనంతపురంలోని ఓ మహిళా ఆరోగ్య సిబ్బంది వైరస్ బారిన పడింది.
ఇదీ చదవండి:మహమ్మారుల ముట్టడి.. పరిశోధనలతోనే అడ్డుకట్ట
Last Updated : Jul 22, 2021, 5:34 AM IST