నదిలోకి ఈతకు వెళ్లి నలుగురు మైనర్లు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ చమోలి జిల్లా థరాలి తాలుకాలో జరిగింది. అయితే నది ప్రవాహం నిలకడగా ఉందని.. లోతు సైతం తక్కువగానే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రాంతం సమీపంలో మత్తు పదార్థాలకు సంబంధించి కొన్ని కాగితాలు సైతం లభ్యం అయ్యాయి.
ఈతకు వెళ్లి నలుగురు మైనర్లు దుర్మరణం.. పక్కనే మత్తు పదార్థాలు.. మృతిపై అనుమానాలు - కాళీ నదిలో నలుగురు మైనర్లు మృతి
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా థరాలి తాలుకాలో విషాదం నెలకొంది. కాళీ నదిలోకి ఈతకు వెళ్లిన నలుగురు బాలురు మృత్యువాత పడ్డారు. కాగా ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
థరాలి తాలుకాకు చెందిన నలుగురు బాలురు దేవాల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుతున్నారు. వీరంతా గత శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు. దాంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. కాగా శనివారం ఉదయం కల్సూరి గ్రామ సమీపంలో కాళీ నదిలో బాలుర మృతదేహాలను స్థానికులు గమనించారు. అనంతరం కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతులను రఘువీర్ సింగ్(16), హరేంద్ర సింగ్ (17), భరత్ సింగ్(15), రాకేష్ మిశ్రా(16) పోలీసులు గుర్తించారు.
అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మృతదేహాలు ఉన్న చోటుకు సమీపంలో వారికి మత్తుకు సంబంధించిన పదార్థాలు లభించాయి. దీంతో మృతులు మత్తు పదార్థాలు తీసుకున్నరా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు పోస్టుమార్టం ఫలితాలు వచ్చిన తర్వాతే అన్నీ విషయాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.