Fake income tax officers: ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని మాన్వేంద్రలో స్పెషల్ 26, గ్యాంగ్ సినిమాల్లోని సీన్ రిపీట్ అయింది. ఐటీ అధికారులమంటూ కొందరు దుండుగలు ఓ ఇంట్లో సోదాలు చేసి రూ.లక్షలు కొల్లగొట్టారు. స్థానికులు ఈ విషయాన్ని తెలుసుకుని వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించారు. నలుగురు నిందితులను వారు అరెస్టు చేశారు.
అయితే మరో నలుగురు దుండగులు పరార్ అయినట్లు అధికారులు వెల్లడించారు. వారి వద్ద డబ్బు, నగలు ఉన్నట్లు చెప్పారు. సోదాలు చేసిన ఇంట్లోని వ్యక్తిని కూడా వారు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దుండగులు అంతా దిల్లీ నుంచి వచ్చారని, రాత్రివేళ ఓ ఇంటికి వెళ్లి ఐటీ అధికారులమని చెప్పి తనిఖీలు చేశారని, డబ్బు, నగలు తీసుకెళ్లారని వివరించారు.