ఓవైపు దేశం కరోనాతో విలవిలలాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను కలవరపెడుతోంది. దేశ నలుమూలలా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలా ప్రజలు అన్ని విధాలుగా అల్లాడిపోతున్న నేపథ్యంలో మరో కొత్త వ్యాధి బయటపడింది. అదే వైట్ ఫంగస్. బిహార్ రాజధాని పట్నాలో 4 వైట్ ఫంగస్ కేసులు నమోదవడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
ఏంటీ వైట్ ఫంగస్?
కరోనా లక్షణాలతో.. పట్నాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవలే నలుగురు చేరారు. వారికి పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్గా తేలింది. దీనిపై అక్కడి వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. విస్తృతంగా పరీక్షించి.. వారికి వైట్ ఫంగస్ సోకిందని నిర్ధరించారు.