తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Four Of Same Family Killed : మద్యం తాగొద్దన్నందుకు ఒకే కుటుంబంలో నలుగురు హత్య.. కొడవలితో నరికి చంపి పరార్​ - కొడవలితో నలుగురు హత్య

Four Of Same Family Killed : ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కొడవలితో నరికి దారుణంగా చంపారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేమైందంటే?

Four Of Same Family Killed
Four Of Same Family Killed

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 10:17 AM IST

Updated : Sep 4, 2023, 11:31 AM IST

Four Of Same Family Killed :మద్యం తాగుతుండగా అడిగినందుకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను సెంథిల్​ కుమార్​ కుటుంబసభ్యులుగా గుర్తించారు. అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పల్లడం ప్రాంతానికి చెందిన సెంథిల్​కుమార్​.. ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. కొన్నినెలల క్రితం ట్యూటికోరిన్​ జిల్లాకు చెందిన వెంకటేశన్​ అనే యువకుడు.. సెంథిల్​ దగ్గర డ్రైవర్​గా విధులకు చేరాడు. కొన్ని కారణాల వల్ల వెంకటేశన్​ను సెంథిల్​ ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో వెంకటేశన్.. తన ఇద్దరు సహచరులతో సెంథిల్​ ఇంటి ఆవరణలో కూర్చుని.. ఆదివారం సాయంత్రం మద్యం సేవించాడు.

అక్కడికక్కడే నలుగురూ..
Four Of Same Family Murder : ఆ సమయంలో తమ ఇంటి దగ్గర కూర్చుని మద్యం ఎందుకు సేవిస్తున్నారని సెంథిల్‌కుమార్ వారిని ప్రశ్నించాడు. అప్పుడు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే వెంకటేశన్​తో ఉన్న​ ఇద్దరు వ్యక్తులు.. తాము తెచ్చిన కొడవలితో సెంథిల్‌ను నరికి చంపేశారు. సెంథిల్​ ఆర్తనాదాలు విన్న అతడి తమ్ముడు మోహన్, బంధువులు రత్నమ్మాల్​, పుష్పవతి.. నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని కూడా నరికి చంపి నిందితులు పరారయ్యారు. సెంథిల్​తోపాటు నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు (పాత చిత్రాలు)

నిందుతులను అరెస్ట్​ చేయాల్సిందే!
స్థానికుల ద్వారా ఘటనపై సమాచారం అందుకున్న పల్లడం డీఎస్పీ.. ఘటనాస్థలికి చేరుకున్నారు. నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు.. ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ప్రాథమిక విచారణలో శత్రుత్వమే హత్యకు కారణమని తెలుస్తోందని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వెంకటేశన్​ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

'నెం.1 సీఎం అని చెప్పుకోవడానికి ఆయనకు సిగ్గు లేదా?'
Tiruppur Family Murder : తిరుప్పూర్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా ప్రార్థించారు. రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనను తాను "నంబర్ వన్ సీఎం"గా ప్రదర్శించుకోవడంపై అన్నామలై మండిపడ్డారు. నిందితులను సత్వరమే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.

"మోహన్‌రాజ్‌తో పాటు అతడి తమ్ముడు, తల్లి, అత్తను దారుణంగా నరికి చంపడం బాధాకరం. మోహన్‌రాజ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అంటూ ట్వీట్​ చేశారు. "రాష్ట్రంలో ఇంకా ఎంత మంది పౌరులు చనిపోవాలి? ప్రతి వీధిలో మద్యం దుకాణాలను తెరిచి.. నియంత్రణ లేని మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం ద్వారా సర్కార్​ డబ్బు సంపాదిస్తోంది. రాష్ట్రంలో రోజూ హత్యలు జరుగుతున్నప్పుడు, శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, తానే నెంబర్‌వన్‌ ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడానికి ఆయనకు(స్టాలిన్​ను ఉద్దేశించి) సిగ్గు లేదా?" అని అన్నామలై ప్రశ్నించారు.

లవ్​ మ్యారేజ్​ చేసుకుందని కూతురు దారుణ హత్య.. ఆమె ఫ్లాట్​కు వెళ్లి.. గొంతు నులిమి..

Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే

Last Updated : Sep 4, 2023, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details