తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటికి నిప్పంటుకొని నలుగురు సజీవదహనం - Four of family killed in UP house fire

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి.. ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

Four of family killed in UP house fire
ఇంటికి నిప్పంటుకుని నలుగురు సజీవదహనం

By

Published : Dec 26, 2020, 3:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ​బాందా జిల్లాలోని దుబెంకా పుర్వా గ్రామంలో ఓ ఇంటికి నిప్పంటుకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

సంగీత యాదవ్​(28) ఇంటి నుంచి పొగలు రావడం గ్రామస్థులు గమనించారు. మంటలు అదుపుచేసి చూసేసరికి.. యాదవ్ సహా ​రెండేళ్ల, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు, ఆరేళ్ల బాలుడు మంటల్లో సజీవ దహనమయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్థులు.

ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మంటలు అంటుకోవడానికి కారణమేంటన్నది తెలియలేదని చెప్పారు.

ఇదీ చూడండి:విధ్వంసానికి 16 ఏళ్లు... స్థానికుల నివాళి

ABOUT THE AUTHOR

...view details