ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన బంగాల్లోని దుర్గాపుర్లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ స్కామ్‌లో ఉన్నవారే తమ మృతికి కారణమని ఉంది. ఈ దారుణ ఘటన దుర్గాపుర్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను అమిత్ కుమార్ మొండల్ (35), రూపా మొండల్ (31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్ (6), నిఖితా మొండల్(ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్లో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో ఓ మెసేజ్ ఉంది. స్థానికులు మాత్రం ఇది అత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేశారని ఉంటారని చెబుతున్నారు.
అమిత్ తల్లిపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదు..
అమిత్ కుటుంబం మృతికి అతడి తల్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే అమిత్ తల్లి, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఆస్తి వివాదం కారణంగానే అమిత్ కుటుంబాన్ని హత్య చేశారు. అమిత్ మెడపై గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు.. కచ్చికంగా హత్యే. అందరి చేతులు కట్టేసి ఉన్నాయి. సీసీ కెమెరా పాలిథీన్ కవర్‌తో మూసేసి ఉంది. అమిత్ తల్లి, మిగతా కుటుంబసభ్యులే వారిని హత్య చేశారు.' అమిత్ భార్య రూప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
'అమిత్ తండ్రి.. నరేశ్ మొండల్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ఆస్తుల కోసమే వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.' అని స్థానికులు తెలిపారని డీసీపీ గౌతమ్ కుమార్ తెలిపారు. అమిత్ కుటుంబ సభ్యుల మృతికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
కుక్కపై అత్యాచారం..
బిహార్ పట్నాలో అమానవీయ ఘటన జరిగింది. కుక్కపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మార్చి 8న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫుల్వారీ షరీఫ్‌లోని ఫైసల్ కాలనీలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి. ఘటనపై ఓ ఎన్జీఓ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.