తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను జయించిన 4 నెలల పసికందు - కొవిడ్​పై పోరాటంలో నాలుగు నెలల పసికందు విజయం

కొవిడ్​ మహమ్మారి బారినపడిన నాలుగు నెలల పసికందు.. దాంతో పోరాడి గెలిచాడు. ఇందుకోసం సుమారు 6 రోజులపాటు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్​పై చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గుజరాత్​లో జరిగింది.

Jugal, 4 months old baby
జుగల్​, నాలుగు నెలల పసికందు

By

Published : May 14, 2021, 11:28 AM IST

Updated : May 14, 2021, 2:34 PM IST

గుజరాత్​లో నాలుగు నెలల చిన్నారి కరోనాను ఓడించాడు. వైరస్​ సోకడం వల్ల.. ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి విషమించగా 6 రోజుల పాటు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. కరోనాను జయించి 15 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

తల్లి చెంత జుగల్​

అసలేం జరిగిందంటే?

ఆనంద్​ జిల్లాకు చెందిన కునాల్​ మక్వాన్​ కుమారుడు జుగల్​(4నెలలు) ఇటీవల అనారోగ్యం బారినపడ్డాడు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నందున.. ఏప్రిల్​ 29న టెస్ట్​లు చేయించగా కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో అహ్మదాబాద్​​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రాణవాయువు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ శిశువును.. అధిక స్థాయి పౌనఃపున్యం కలిగిన వెంటిలేటర్​పై ఉంచారు వైద్యులు. అలా 6 రోజులపాటు చికిత్స అందించాక.. తిరిగి మామూలు స్థితికి వచ్చాడా బాలుడు. ఆ తర్వాత పరీక్షలు చేయించగా నెగెటివ్​గా తేలింది. దీంతో 15 రోజుల పాటు ఆస్పత్రిలో గడిపాక ఆ చిన్నారిని డిశ్ఛార్జ్​ చేశారు వైద్యులు.

జుగల్​తో ఆస్పత్రి సిబ్బంది

అంతకుముందు.. జుగల్​కు పుట్టినప్పుడే హార్ట్​లో బ్లాగ్​ ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 14న సంబంధిత శస్త్రచికిత్స కూడా జరిగింది. ఫలితంగా.. తన తొలి 51 రోజులు ఆస్పత్రిలోనే గడిపాడు ఆ పసికందు.

ఇదీ చదవండి:చిన్నారులకు కరోనా సోకితే?

Last Updated : May 14, 2021, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details