జమ్ముకశ్మీర్, కుల్గాం జిల్లాలోని రెండు ప్రాంతంలో ఎదురుకాల్పులు(jammu kashmir encounter today) జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో(Encounter news) ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు.
జిల్లాలోని పొంబాయ్, గోప్లాపొరా ప్రాంతాల్లో(encounter today in kulgam) ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు జవాన్లు. బలగాలు తారసపడగానే వారిపై కాల్పులకు తెగబడ్డారని, అది ఎన్‌కౌంటర్‌కు(encounter today) దారితీసినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
టీఆర్ఎఫ్ కమాండర్ హతం..
గోప్లాపొరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, అందులో ద రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కమాండర్ అఫాక్ సికందర్ ఉన్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.
ఉగ్ర కుట్ర భగ్నం..
మరోవైపు.. పుల్వామా పోలీసులు, భద్రతా దళాలు కలిసి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. తనిఖీల్లో భాగంగా.. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పని చేస్తున్న అమిర్ బషీర్, ముఖ్తార్ భట్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌పై కశ్మీర్లో రగడ- ఆ జిల్లాలో ఆంక్షలు