నకిలీ చెక్కులు సృష్టించి అయెధ్య రామ మందిర ట్రస్టు ఖాతా నుంచి రూ.6లక్షలను మరో బ్యాంకు ఖాతాలోకి దారిమళ్లించిన నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిని ముంబయి, ఠాణెకు చెందిన వారుగా గుర్తించారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ట్రస్టు పేరు మీదున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాలోకి రూ.2.5లక్షలు, రూ.3.5లక్షలను సెప్టెంబర్‌లో అక్రమంగా దారిమళ్లించారని, దీని కోసం రెండు నకిలీ చెక్కులు సృష్టించి, రామాలయ ట్రస్టు సభ్యులు సంతకాలు ఫోర్జరీ చేసినట్లు అయోధ్య డీఐజీ దీపక్ కుమార్ వెల్లడించారు. రెండుసార్లు సఫలమైన తర్వాత మూడోసారి రూ.9.86లక్షలను బ్యాంక్ ఆప్ బరోడా ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నించారని, ఇంత భారీ మొత్తం చెక్కును చూసిన బ్యాంకు అధికారులు ట్రస్టు ఛైర్మన్‌కు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడిందని వివరించారు.