తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ జూలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్​ నిర్ధరణ - NIHSAD, Bhopal fullform

చెన్నైలోని వాండలూర్‌ అన్నా జూపార్కులో నాలుగు సింహాలకు కొత్తరకం కరోనా 'డెల్టా వేరియంట్‌' సోకినట్లు జూ సిబ్బంది నిర్ధరించారు. భోపాల్​లోని 'నిషాద్​' ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడినట్లు పేర్కొన్నారు.

lions
సింహాం

By

Published : Jun 19, 2021, 12:28 PM IST

తమిళనాడు చెన్నైలోని వాండలూర్ జూలో సింహాలకు డెల్టా వేరియంట్ రకం కరోనా సోకినట్లు జూ అధికారులు తెలిపారు. జూలోని సింహాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్​లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్) ప్రయోగశాలలో పరీక్షించారు. ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఈ అంశం వెల్లడైనట్లు జూ అధికారులు తెలిపారు.

వాటిలో మొత్తం నాలుగు సీక్వెన్సులు పాంగోలిన్ వంశం బి.1.617.2కు చెందినవని.. వీటిని డబ్ల్యూహెచ్ఓ 'డెల్టా వేరియంట్'గా గుర్తించిందని జూ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

మే 24న పదకొండు సింహాలు, మే 24న నాలుగు, మే 29న ఏడు సింహాల నమూనాలను భోపాలోని నిషాద్​కు జూ సిబ్బంది పంపారు. జూన్ 3న ఫలితాలు రాగా.. 9 సింహాలకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిందని.. వాటికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:ఆ జూపార్కులో కరోనాకు మరో మృగరాజు బలి

జూపార్కులో కరోనాతో ఆడ సింహం మృతి

ABOUT THE AUTHOR

...view details