మధ్యప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఏదో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఛతర్‌పుర్‌లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు.
ఛతర్‌పుర్ జిల్లాలోని ప్రకాశ్ బామోరి పోలీస్ స్టేషన్ పరిధిలో.. నివాసముండే ఇద్దరు బాలికలు(ఐదేళ్లు, పదకొండేళ్లు) ఓ ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగివెళ్తున్నారు. వారిని అడ్డగించిన ఇద్దరు దుండగులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.