తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిత్రుడి ప్రాణాలు కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా.. - మండ్య కాలువలో పడి చనిపోయిన మిత్రులు

కర్ణాటక మండ్యలో హృదయ విదారక ఘటన జరిగింది. దేవాలయాన్ని సందర్శించుకొని ఓ వ్యక్తి పక్కనే ఉన్న కాలువలో సరదాగా ఈతకు దిగాడు. కానీ అదుపు తప్పడం వల్ల మునిగిపోయి మరణించాడు. అతడిని కాపాడటానికి వెళ్లిన మరో ముగ్గురు మిత్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Four Friends drowned in Canal at Mandya
మిత్రుడి ప్రాణాలు కాపాడబోయి

By

Published : Aug 25, 2021, 4:26 PM IST

నీటిలో మునిగిపోతున్న మిత్రుడిని కాపాడబోయి.. మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక మండ్యాలోని కేఆర్​ పేటే తాలూకాలో ఉన్న మండగెరె ఎడమ కాలువ వద్ద జరిగింది.

అధికారులు బయటకు తీసిన మరో ఇద్దరి మృతదేహాలు
అధికారులు బయటకు తీసిన మృతదేహం

ఇదీ జరిగింది..

మండ్య కేఆర్​ పేట్​లో ఉండే చండగొల్లమ్మ గుడిని దర్శించుకోవడానికి.. మొత్తం 8మంది మిత్రులు మైసూర్​ నుంచి వచ్చారు. పూజాది కార్యక్రమాల అనంతరం వారు సరదాగా ఈత కొట్టడానికి కాలువలో దిగారు. రాజు అనే యువకుడు మునిగిపోవడం చూసిన మరో స్నేహితుడు కాపాడేందుకు కాలువలోకి దిగాడు. చాలా సమయం గడిచినా.. వారు తిరిగి రాకపోవడం వల్ల మరో ఇద్దరు వారి కోసం గాలించేందుకు నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తూ వారందరు చనిపోయారు.

ఇది తెలిసి ఇద్దరు స్నేహితులు భయంతో అక్కడి నుంచి పరుగులతీశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేఆర్ పేట్‌ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

మరోవైపు చనిపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు.. మంజు, రాజు, చంద్రుగా గుర్తించారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:'ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం!'

ABOUT THE AUTHOR

...view details