తమిళనాడులోని ధర్మపురి జిల్లా.. సాలెం-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు.
ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలు జాతీయ రహదారిపై వస్తున్న ఓ లారీ అదుపు తప్పి.. 15 వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అందులో 12 కార్లు, 2 మినీ లారీలు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నాయి.
క్రేన్ సాయంతో వాహనాలను తరలిస్తున్న అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఎట్టకేలకు ఆ లారీ.. దగ్గర్లోనే ఓ వంతెనను ఢీకొని నిలిచిపోయింది. గాయపడిన వారిని వెంటనే.. ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల రహదారిపై దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇదీ చూడండి:పెంపుడు శునకాన్ని కారుకు కట్టి.. ఈడ్చుకెళ్లి..