ఈశాన్య రాష్ట్రంలో చెలరేగిన పరిణామాలు మహారాష్ట్రలో (Amaravati violence) చిచ్చుపెట్టాయి. త్రిపురలో ఇటీవల చెలరేగిన హింసను ఖండిస్తూ కొన్ని ముస్లిం సంఘాలు శుక్రవారం ర్యాలీలు నిర్వహించగా, వాటికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దుకాణాలపై రాళ్లు రువ్వడం హింసకు దారి తీసింది. అమరావతితో(Amaravati news) పాటు నాందేడ్, మాలేగావ్, వషీం, యావత్మాల్ జిల్లాల్లోనూ అల్లర్లు చెలరేగాయి. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీలు ఝళిపించి, 20 మందిని అరెస్టు చేశారు. వివిధ అభియోగాలతో 20 కేసులు నమోదు చేశారు. మాలేగావ్‌లో ముగ్గురు అధికారులు సహా 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసు వాహనంపై(Amaravati violence) దాడికి దిగారు. దీంతో అమరావతి నగరంలో (Amaravati news) నాలుగు రోజులు కర్ఫ్యూ విధించారు అధికారులు. తిరిగి ప్రకటించే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతర్జాల సేవల్ని కూడా నిలిపివేశారు.
శుక్రవారం నాటి ర్యాలీల అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినవారు తిరిగి వెళ్తుండగా మూడు చోట్ల రాళ్లదాడి జరిగింది. దానికి నిరసనగా (Amaravati protest) శనివారం చేపట్టిన బంద్‌లో పలువురు కాషాయ పతాకాలు చేతపట్టుకుని పాల్గొన్నారు. వరసగా రెండ్రోజులు రాళ్లు రువ్వుకున్న ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైద్యపరమైన అవసరాల కోసం తప్పిస్తే ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విధించారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఇది : శివసేన
మహారాష్ట్ర(Amaravati news) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్ని పలు ప్రాంతాల్లో హింసను ఎగదోస్తున్నారని.. పరోక్షంగా భాజపాను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఘటనలకు(Amaravati violence) కారకులైనవారి బండారాన్ని బట్టబయలు చేస్తామని చెప్పారు.