మగ సంతానం లేని ఆ తల్లికి కూతుళ్లే కుమారులుగా మారి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మహారాష్ట్రలోని బీఢ్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
శిరూర్ కసర్ తాలూకా జాంబ్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి రాంభౌ కాంబ్లే మే 20న కన్నుమూసింది. కొడుకులు లేని లక్షీబాయికి ఆమె కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు. శకుంతల అనే చిన్న కూతురు దహనసంస్కారాలు నిర్వహించింది.
తల్లి దహన సంస్కారాలు నిర్వహించిన కుమార్తెలు ఎన్నడూ చూడలేదు..
చనిపోయిన వ్యక్తికి కూతుళ్లే అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని గ్రామస్థులు తెలిపారు. అయితే.. సాధారణంగా మగవారే ఈ తంతును నిర్వహించాలన్న ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనపెట్టి తమ తల్లికి చివరి కర్మలు నిర్వహించడాన్ని వారంతా ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి:ముందు మీరేం చేశారో చెప్పండి: ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
వాట్సాప్లో దినపత్రికలు షేర్ చేస్తే అంతే!