Four Children Died in Krishna River at Borivali: పిల్లలందరూ సరదాగ గడిపేందుకు.. నది దగ్గరకు వెళ్లారు. వెళ్లిన వారిలో పెద్దవాళ్లు ఎవరు లేరు. అక్కడ ఆడుకుంటున్న క్రమంలో కాలికి మట్టి అంటుకుంది. దాని కడిగే సమయంలో నదిలో ఒక పిల్లవాడు పడిపోయాడు. వాడిని కాపాడేందుకు మరో అమ్మయి పడిపోయింది. ఇలా రక్షించే క్రమంలోనే నలుగురు పిల్లలు నదిలో పడి మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నదిలో దిగి గాలించారు. చివరికి ఆ నలుగురు ప్రాణం లేకుండా విగత జీవిగా లభ్యంమయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లాలో జరిగింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన మున్నా, ఇస్మాయిల్,ఇబ్రహీంలు అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం కర్నూలుకు వలస వెళ్లి.. అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వేసవి సెలవుల్లో అన్న దమ్ములు, అక్కచెల్లలతో ఆటలాడుకునేందుకు ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు బందువైన మావనపాడు మండలం బోరవల్లికి చెందిన మాసుం ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. సరాదాగా గడిపేందుకు మాసుం ఇద్దరు పిల్లలు, మున్నా ఇద్దరు పిల్లలు, ఇస్మాయిల్ ముగ్గురు పిల్లలు, ఇబ్రహీం ముగ్గురు పిల్లలు మొత్తం 10 మంది కలసి ఇటిక్యాల మండల గార్లపాడు గ్రామానికి సమీపంలోని మంగపేట గ్రామ శివారులో కృష్ణానదికి వెళ్లారు. నదిలో ఈత కొట్టేందుకు దిగారు. మాసుం కుమారుడు ఇమాం నది లోపలికి వెళ్లొదంటు హెచ్చరిస్తూ నది ఆవతల ఒడ్డుకి వెలుతుండగా ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రిహాన్ (15)లతో పాటు.. ఇబ్రహీం కూతుర్లు అఫ్రీన్(17), నౌషిన్(15)లు నదిలో లోతట్టు ప్రాంతానికి వెళ్లి మునిగిపోయారు.