తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Tragedy: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. 9మంది మృతి - గ్యాస్ సిలిండర్​​ పేలుడు

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు పిల్లలు ఉన్నారు.

lpg cylinder leak
గ్యాస్ సిలిండర్​​ పేలుడు

By

Published : Jul 25, 2021, 3:29 AM IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ శివారులో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ చిన్న గదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు పిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది.

అహ్మదాబాద్‌ శివారులో ఈ నెల 20న ఓ గదిలో ఎల్‌పీజీ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో పాటు మొత్తం 10 మంది తీవ్ర గాయాలపాలవ్వగా అందరినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం రోజున ముగ్గురు మృతిచెందగా.. శుక్రవారం ఐదుగురు, శనివారం ఉదయం ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు. వీరందరూ మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించినట్టు అస్లాలి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పీఆర్‌ జడేజా వెల్లడించారు. ప్రస్తుతం ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details