తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో బాలికపై సాముహిక అత్యాచారం - ఉత్తర్​ప్రదేశ్

ఓ బాలికపై ఆమె బంధువు​, మరో ముగ్గురు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ సంఘనటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

rape
అత్యాచారం

By

Published : Apr 10, 2021, 9:15 PM IST

16ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోను.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బాధితురాలిని బెదిరించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి బంధువు​ కూడా నిందితులలో ఉండడం గమనార్హం.

"ఓ బాలికపై ఆమె బంధువు​, మరో ముగ్గురు యువకులు నెలరోజుల క్రితం అత్యాచారం చేశారు. ఏప్రిల్​2న బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆమె సోదరుడు కాపాడాడు."

-మనోజ్​ కుమార్​ సింగ్​, ఎస్​హెచ్​ఓ

కాగా, ఆ నలుగురు వ్యక్తులపై పోక్సో కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు

ABOUT THE AUTHOR

...view details