JeM terrorists arrested: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ సంస్థతో సంబంధం ఉన్న నలుగురిని జమ్ము కశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులను ఇంతియాజ్ అహ్మద్ రాథర్, నసీర్ అహ్మద్ మాలిక్, రయీస్ అహ్మద్ షేక్, యావర్ రషీద్ ఘనీగా గుర్తించారు. వీరంతా జైషే మహ్మద్ ముష్కరులకు రవాణా, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారని పోలీసులు తెలిపారు.
కశ్మీర్లో నలుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్ - south kashmir
JeM terrorists arrested: జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న నలుగురిని జమ్ము కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ముష్కరులకు సాయం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
జైషే మహ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్
శనివారం.. చెవా కల్లాన్ వద్ద జరిగిన ఆపరేషన్‌లో నిషేధిత సంస్థ జైషే-ఈ- మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఏఎస్ఐ గంజాయి దందా.. 420 కిలోలతో రెడ్ హ్యాండెడ్గా..