అయోధ్య జిల్లాలోని ధన్నిపుర్ గ్రామ సమీపంలో చేపట్టనున్న మసీదు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన ఐదెకరాల స్థలంలో మొక్కలు నాటడం, భూమి చదును చేయడం ద్వారా పనులు ప్రారంభిస్తున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ పేర్కొంది.
అయోధ్య మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన - అయోధ్య మసీదు నిర్మాణం
అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు నేడు శంకుస్థాపన జరగనుంది. మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 9 మంది ధర్మకర్తలు 9 మొక్కలు నాటుతారని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ పేర్కొంది.
అయోధ్య మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన
ఈ సందర్భంగా 9 మంది ధర్మకర్తలు 9 మొక్కలను నాటనున్నారు. మసీదును దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు 'మౌల్వీ అహ్మదుల్లా షా' కు అంకితం చేయనున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.