తెలంగాణ

telangana

ETV Bharat / bharat

K9-Vajra: లద్దాఖ్‌ సిగలో 'వజ్రా'యుధం

లద్దాఖ్​లోని(Eastern Ladakh) ఫార్వర్డ్​ ఏరియాల్లో తొలిసారిగా కే9-వజ్ర శతఘ్నులను(k9 vajra howitzer) మోహరించింది భారత్​. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ సైన్యానికి అధునాతన ఆయుధాలను(k9 vajra indian army) అందిస్తోంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై ఈ కే9 వజ్ర శతఘ్నులు(k9 vajra range) దాడి చేయగలవు.

K9-Vajra self-propelled howitzer
స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9- వజ్ర శతఘ్నులు

By

Published : Oct 2, 2021, 4:46 PM IST

Updated : Oct 2, 2021, 7:49 PM IST

లద్దాఖ్​లో మోహరించిన కే9- వజ్ర శతఘ్నులు

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ తూర్పు లద్దాఖ్‌లో(Eastern Ladakh) అధునాతన ఆయుధాలను మోహరిస్తోంది భారత సైన్యం(k9 vajra indian army). ఇందులో భాగంగానే లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌ ఏరియాల్లో తొలిసారిగా కే9- వజ్ర శతఘ్నులను(k9 vajra howitzer) మోహరించింది. స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9- వజ్ర శతఘ్నులు(k9 vajra howitzer gun).. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై(k9 vajra range) విరుచుకుపడి ధ్వంసం చేయగలవు. ఈ హోవిట్జర్‌లతో కూడిన మొత్తం రెజిమెంట్‌ను వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్‌ సెక్టార్‌లో మోహరించారు.

స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9- వజ్ర శతఘ్నులు

"ఈ శతఘ్నులు అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోనూ పనిచేయగలవని సన్నాహక పరీక్షల్లో రుజువైంది. ప్రస్తుతం కే-9 వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. లద్దాఖ్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి"

-ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె.

కే9 వజ్ర హోవిట్జర్‌ను(k9 vajra howitzer) 2018లో సైన్యంలో(k9 vajra indian army) ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంస్థ ఎల్‌ అండ్‌ టీ వీటిని గుజరాత్‌లో తయారు చేసింది. ఈ శతఘ్ని 50 టన్నులు బరువు ఉంటుంది. 47 కేజీల బాంబులను పేల్చగలదు.

ఇదీ చూడండి:చైనా సరిహద్దులోని సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

Last Updated : Oct 2, 2021, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details