గత ఏడాదిలో 5,133 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లఘించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనల్లో 46 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
పాక్ దాడులకు భారత భద్రతా దళాలు సైతం తగిన సమాధానమిచ్చాయని ఆయన చెప్పారు. కాల్పులపై ఇరుదేశాల మిలిటరీ జనరల్స్ ప్రతివారం సమావేశాలు జరుపుతారని తెలిపారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు రేఖ పవిత్రతను కాపాడాలని పాకిస్థాన్‌కు ఎన్నోసార్లు నొక్కిచెప్పినట్లు గుర్తుచేశారు రాజ్‌నాథ్.