Fortified Rice Distribute Scheme: ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పంపిణీ కోసం 88.65 ఎల్ఎమ్టీ బలవర్ధక బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మొదటి దశలో ఐసీడీఎస్, పీఎం పోషణ్ కార్యక్రమాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం - PDS
Fortified Rice Distribute Scheme: ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కోసం సుమారు రూ. 2,700 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
బియ్యం
రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మార్చి 2023 నాటికి మరికొన్ని జిల్లాల్లో అమలు చేస్తామని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. చివరి దశలో, మిగిలిన అన్ని జిల్లాల్లో మార్చి 2024 నాటికి పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ఖర్చు సంవత్సరానికి సుమారు రూ. 2,700 కోట్లు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి:'ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణ'.. సుప్రీం కీలక నిర్ణయం!