తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స - ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

mulayam singh yadav health
mulayam singh yadav health

By

Published : Oct 9, 2022, 3:23 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్​ యాదవ్​ ఆరోగ్యం విషమంగానే ఉంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. "ములాయం సింగ్‌ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. జీవనాధార ఔషధాలతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది" అని ఆస్పత్రి బులిటెన్‌ను విడుదల చేసింది.

ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. కాగా, 82 ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫోన్​ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details